Vineela | ఆశీర్వదించండి…ప్రజాసేవే నా లక్ష్యం..

Vineela | ఆశీర్వదించండి…ప్రజాసేవే నా లక్ష్యం..
అడిగొప్పుల వినీల ప్రదీప్
Vineela | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : తొలిసారిగా ప్రజాసేవకు అంకితం అవుదామనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని…ఈ ఎన్నికల్లో మీ ఆడబిడ్డగా ఆశీర్వదించాలని, అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని అడిగొప్పుల (చింత) వినీల ప్రదీప్ బుధవారం కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కమ్మర్ పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థినీగా మీ ముందుకు వస్తున్నానని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని, గ్రామ సమగ్ర అభివృద్ధికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నానని,గ్రామస్తుల మద్దతు కూడగట్టుకుని ప్రజల సహకారంతో నామినేషన్ వేసినట్లు ఆమె తెలిపారు.
గ్రామంలోని అన్ని వాడవాడలో తిరుగుతూ ఓటర్లతో మమేకమై అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం సాగిన ప్రతి వాడలో అడిగొప్పుల వినీల ప్రదీప్ కు అనూహ్య స్పందన లభించింది. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను సర్పంచ్ గా గెలిపిస్తే.. గ్రామంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, రోడ్లు డ్రైనేజ్ వీధిలైట్లపై నిరంతర పర్యవేక్షణ, మహిళల కోసం స్వయం సహాయక ప్రోత్సాహక పథకాలు, రైతులకు నీరు, విత్తనాలు, ఎరువులు సులభంగా అందించే ఏర్పాట్లు, అర్హులైన ప్రతి వారికి పింఛన్ల పంపిణీలో పారదర్శకత, యువతకు ఉపాధి నైపుణ్య, అభివృద్ధి కార్యక్రమాలు, యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం టోర్నమెంటులు నిర్వహించడం, ప్రతి ఇంటికి సురక్షిత వాతావరణం గ్రామంలో శాంతిభద్రత, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తానని అడిగొప్పుల వినీల ప్రదీప్ హామీ ఇచ్చారు.
