వికారాబాద్ టౌన్ ఏప్రిల్ 6( ఆంధ్రప్రభ) గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన సంఘటన రైల్వే పరిధిలో ఆదివారం రోజు చోటు చేసుకున్నది రైల్వే పోలీసు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం ఆదివారం ఉదయం 0915 గంటల కన్నా ముందు వికారాబాద్ గోదంగూడ రైల్వే స్టేషన్ల మధ్య వికారాబాద్ పోలీస్ డి టి సి రైల్వే ట్రాక్ కిలోమీటర్ నెంబర్ 110/4 వద్ద డౌస్ లైస్ ట్రాక్ (గంగారంవెనకవైపు) మీద ఒక గుర్తు తెలియని మగమనిషి రైలు బండి కింద పడి చనిపోయాడు,
అతని వద్ద చిరునామాకు సంభందించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు.చనిపోయిన వ్యక్తి అంజాద 35సంవత్సరాలు వయసు, ఛమన చాయా, గుండ్రటి మూఖము నలుపు వెంట్రుకలు కలిగి ఉన్నాడు. ఏత్తు 5.6 అడుగులు. చనిపోయినవ్యక్తి క్రీమ్ కలర్ టి షర్ట్. నీలం రంగు ట్రాక్ ఫ్యాంట్, ధరించివున్నాడు
మృతుని మృతదేహాన్నివికారాబాద్ ఏరియా హాస్పిటల్ మార్చురి నందు భద్రపరచడం జరిగినది. మృతునికి సంభందించి ఏమైనా సమాచారం ఉంటే స్టేషన్ రైల్వే పోలీసు స్టేషన్, ఎస్ ఏచ్ ఓ ఫోన్ నెంబర్స్ 8466938351, 9989355134 వికారాబాద్ సమాచారం అందించగలరని తెలిపారు