గంటల్లోనే అమ్మానాన్న చెంతకు..

చిన్నారుల అదృశ్యం కేసులో పటమట పోలీసులు రికార్డు

( ఆంధ్రప్రభ, విజయవాడ)

చిన్నారుల అదృశ్య ఘటనపై ఫిర్యాదు అందిన గంట లోపే పటమట పోలీసులు ( ( Vijayawada police chased)  చేదించారు. రామవరప్పాడుకు ( ramavarappadu)   చెందిన వెంకటేశ్వరమ్మ తన కుమారుడు ఇస్సాకు (5), మహాలక్ష్మి తన కుమార్తె స్వాతి(4)లను తన ఇంటి సమీపంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో విడిచిపెట్టి పనులకు వెళ్లిపోయారు. అప్పటికీ ఇంకా అంగన్వాడీ కేంద్రం ( At anganwadi cemtre)  తెరవకపోవడంతో చిన్నారుల ఇద్దరూ అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయారు. సాయంత్రం వరకు చూసిన పిల్లలు (children)  ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అడుగగా  అస్సలు అంగన్వాడీ కేంద్రానికి రాలేదని తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల్లో గాలించినా చిన్నారుల ఆచూకీ ( missing)  లభించకపోవడంతో రాత్రి 8.40 నిమిషాలకు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సీపీ రాజశేఖర్ బాబు ( police cmmissionar) ఆదేశాల (ordered) మేరకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఏసీపీ దామోదర్, పటమట సీఐ పవన్ కిషోర్, ఆరుగురు ఎస్ఐలతో సహా 30 మంది సిబ్బందితో కలిసి 10 బృందాలుగా ( 10 police Teams) చిన్నారుల ఆచూకీ కోసం గాలించారు. చిన్నారుల వివరాలను పోలీస్ వాట్సాప్ గ్రూప్లో పెట్టడంతో  ఆ చిన్నారులు సత్యనారాయణపురంలో chidren found in satyanarayana puram)  తిరుగుతున్నట్లు సత్యనారాయణపురం స్టేషన్ పోలీసులు గుర్తించి స్టేషన్కు తరలించి పటమట పోలీసులకు సమాచారం అందించారు. పటమట పోలీసులు చిన్నారులను పటమట స్టేషన్ కు తీసుకువచ్చారు.  చిన్నారుల తల్లిదండ్రులకు డిసిపి కౌన్సిలింగ్ నిర్వహంచి చిన్నారులను children surrendered to parents) వారికి అప్పగించారు. దీంతో చిన్నారుల మిస్సింగ్ కేసు సుఖాంతమైంది.

Leave a Reply