Vijayawada | మరింత బలోపేతంగా..

Vijayawada | మరింత బలోపేతంగా..

  • తూర్పులో వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం
  • 45 రోజుల్లో మండల, బూత్ కమిటీల ఏర్పాటు
  • దిశానిర్దేశం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్..

Vijayawada | ( ఆంధ్రప్రభ విజయవాడ) : విజయవాడలోని గుణదలలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పై జిల్లా అధ్యక్షుడు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఇన్‌చార్జ్‌, ఎన్టీఆర్,కృష్ణా జిల్లాల టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్‌ వరుకుటి అశోక్ బాబు, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలో మండల, బూత్ స్థాయిల్లో కమిటీలతో పాటు అనుబంధ విభాగాలను 45 రోజుల్లో ఏర్పాటు చేయాలని నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడేలా పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో పార్టీ ఉనికి స్పష్టంగా కనిపించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని, పార్టీ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు, ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, డిజిటల్ మేనేజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply