విజయవాడ నగర వాసులకు రెడ్ అలెర్ట్…

విజయవాడ నగర వాసులకు రెడ్ అలెర్ట్…
అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు
లోతట్టు కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షితమైన ప్రదేశాలకు తరలి రావాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ, ఎన్టీఆర్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు, కొండ వాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షితమైన ప్రదేశాలకు తరలి రావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న మూడు నుంచి నాలుగు గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని అన్నారు.
సురక్షితమైన ప్రదేశాలకు చేరుకున్నాక అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల పునరావస కేంద్రాలన్నిటిని పూర్తి అందుబాటులో ఉంచారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకుంటుందని అన్నారు.
