Custodial torture case | విజయ్ పాల్‌కు బెయిల్
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్ పాల్‌కు బెయిల్ మంజూరైంది. ఆయనకు గుంటూరు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న విజయ్ పాల్.. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కాగా, ఈ ఉదయం రఘురామకృష్ణంరాజు గుంటూరు కోర్టుకు వచ్చారు. స్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన ఓ అంశంపై కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు.