Vijay Kumar | 15వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

Vijay Kumar | 15వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
- బీజేపీ అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్
Vijay Kumar | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని 15వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 15వ వార్డులో బీజేపీ బలపరిచిన కుక్కల విజయ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పట్టణంలోని 15వ వార్డులో కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఇంటింటి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థి కుక్కల విజయకుమార్ ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థిగా తనను గెలించడానికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అవినీతి కి ఆస్కారం లేకుండా ప్రజలకు పనులు చేసి పెడుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకే మున్సిపల్ కౌన్సిలర్ గా బీజేపీ బలపరిచిన అభ్యర్తిగా పోటీలో ఉన్నట్టు పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అవినీతి లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని చూసి బీజేపీ కమలం (పువ్వు) గుర్తుకు ఓటు వేయాలని వేడుకున్నారు. అభ్యర్థి విజయ్ కుమార్ వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
