Victory | 2026 ప్లానింగ్ అదిరింది..

Victory | 2026 ప్లానింగ్ అదిరింది..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్.. కుటుంబ కథా చిత్రాల కథనాయకుడుగా.. ఎన్నో విభిన్న కథా చిత్రాలను(Story pictures) అందించారు. ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2025లో సంక్రాంతికి వస్తున్నాం అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఈ ఇయర్ అంతకు మించి అనేట్టుగా ప్లాన్ రెడీ(Plan is ready) చేశారు. ఏది ఏమైనా.. వెంకీ రూటే సపరేటు. ఇంతకీ.. వెంకీ 2026లో ఏం చేయబోతున్నారు..?
Victory | గెస్ట్ రోల్ కాదు..

వెంకీ.. ఈ ఇయర్ లో ముందుగా జనవరి 12న మన శంకర్ వరప్రసాద్ గారు(mana Shankara Varaprasad garu) అనే సినిమాతో వస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెంకీ నటించడం విశేషం. ఈ సినిమాలో వెంకీ ముఖ్యపాత్ర పోషించడం విశేషం. ముందుగా ఈ సినిమాలో వెంకీ(Venky in the movie) నటిస్తున్నారని ప్రకటించినప్పుడు సినీ జనాలు గెస్ట్ రోల్ అనుకున్నారు. అయితే.. ఇది గెస్ట్ రోల్ కాదని.. ముఖ్యపాత్ర అని.. దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉంటుందని తెలిసింది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన చిరు, వెంకీ సాంగ్ అయితే.. వేరే లెవల్లో ఉంది. ఈ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేసింది.
Victory | సరికొత్త ఆదర్శ కుటుంబం…

ఇక వెంకీ సోలో హీరోగా నటిస్తున్న మూవీ ఆదర్శ కుటుంబం.. ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas, the magician of words) తెరకెక్కిస్తున్నారు. వెంకీతో త్రివిక్రమ్ కలిసి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు చేశారు. అయితే.. ఆ చిత్రాలకు కథ – మాటలు మాత్రమే అందించారు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ వెంకీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈసారి త్రివిక్రమ్ రూటు మార్చి.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు క్రైమ్ టచ్ ఇవ్వబోతున్నారని ఫస్ట్ లుక్ ను బట్టి తెలిసింది. మార్చికి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్(Movie shooting complete) చేసి.. సమ్మర్ లో ఈ భారీ చిత్రాన్ని విడుదల చేయాలి అనేది ప్లాన్.
Victory | మరో సెన్సేషన్ దృశ్యం 3..

ఈ రెండు సినిమాలతో పాటు.. వెంకీ మరో సినిమాను కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్(Released this year) చేయాలి అనుకుంటున్నారట. ఇంతకీ.. ఏ సినిమా..? ఎవరితో అంటారా..? దృశ్యం సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో.. ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సీరిస్ లో భాగంగా దృశ్యం-3(drushyam 3) చేయబోతున్నారట వెంకీ. ఈ క్రేజీ మూవీని కూడా ఈ సంవత్సరలోనే విడుదల చేయాలి అనేది ప్లాన్. సో.. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో వెంకటేష్ నుంచి మూడు సినిమాలు వస్తాయి. మరి.. ఈ మూడు సినిమాలతో వెంకీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
