కడెం, ఆంధ్రప్రభ : వరదల్లో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం (government) ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. ఈ రోజు కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్పారెడ్డి గంగాధర్ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కడెం డ్యాం ప్రాజెక్టు గేట్లు (Kadem Dam project gates) ఎత్తగా వరద నీటి ప్రవాహానికి వరదలో కొట్టుకుపోయి ఇప్పటికీ ఆచూకీ దొరకలేదని, అయితే గంగాధర్ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యుల(family members)కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ (Collector Abhilasha Abhinav), జిల్లా అడిషనల్ కలెక్టర్ (Additional Collector)లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ నిర్మల్ ఆర్ డి ఓ రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
మృతుల బాధితులకు సాయం
