Vice Chairman | మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ మరింత హీట్…

Vice Chairman | మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ మరింత హీట్…

ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశీస్సులు ఎవరి వైపు?
బీసీ కోటా సమీకరణాల్లో కొత్త ట్విస్ట్
18వ వార్డు పొన్న రవి ఎంట్రీతో పెరిగిన ఆసక్తి
వైస్ చైర్మన్ పదవి కోసం పొన్న రవికి అవకాశం కల్పించాలని రజక సంఘం వినతి

Vice Chairman | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిపై రాజకీయ చర్చ లు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌ కు కేటాయించబడిన నేపథ్యంలో సామాజిక సమతుల్యత దృష్ట్యా వైస్ చైర్మన్ పదవిని బీసీ వర్గానికి ఇవ్వాలన్న ఆలోచన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్గాల్లో జరుగుతున్నట్లు సమాచారం. దీంతో పట్టణ రాజకీయా ల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రేసులో ప్రధానంగా ముగ్గురు మహిళా కౌన్సిలర్లు 12వ వార్డు గట్టు సంగీత, 7వ వార్డు అన్నెపు సుమలత, 11వ వార్డు నీల రాజమ్మ ముందంజలో ఉన్నట్లు చర్చ సాగింది. అయితే తాజా పరిణామంగా 18వ వార్డు కౌన్సి లర్ పొన్న రవి పేరు బలంగా వినిపించడం ఆసక్తిని మరింత పెంచింది.

పొన్న రవికి కడియం ఆశీస్సులు దక్కెనా?


బీసీ జనరల్ సీటు ద్వారా గెలుపొందిన పొన్న రవి పట్టణంలో తన సొంత వర్గాన్ని నిర్మించుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రతో పాటు స్థానిక స్థాయిలో బలమైన అనుబంధాలు ఆయనకు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతు న్నాయి. ఒకవేళ వైస్ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయిస్తే మహిళా కోటా కంటే పురుష అభ్యర్థికి అవకాశాలు పెరగవచ్చన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అలా జరిగితే పొన్న రవి పేరు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మె ల్యే కడియం శ్రీహరి ఆశీస్సులు ఎవరికీ దక్కుతాయన్నదే ఇప్పుడు కీలక అంశంగా మారింది.

రవికి అవకాశం కల్పించాలని రజక సంఘం వినతి:

ఇక మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం 18వ వార్డులో గెలిచిన పొన్న రవికి అవకాశం కల్పించాలని రజక సంఘం తరఫున మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కోరినట్లు సమాచారం. ఈ వినతి కూడా రాజ కీయ సమీకరణాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మొత్తానికి స్టేషన్ ఘన్‌ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిపై రాజకీయ ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. రేపు (16న) అధికారిక ప్రకటన వెలువడే వరకు పట్టణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా కొనసాగే అవకాశముంది.

Leave a Reply