Venkatesh | రెమ్యూనరేషన్ ఎంత..?

Venkatesh | రెమ్యూనరేషన్ ఎంత..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమాలో చిరుతో పాటు విక్టరీ వెంకటేష్ నటించి ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేశారు. సంక్రాంతి తర్వాత కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ రాబడుతుండడం విశేషం. అయితే.. ఇప్పుడు వెంకీ రెమ్యూనరేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ అయ్యింది. దీని పై నిర్మాత సుస్మిత ఓ ఇంటర్ వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ.. వెంకీకి ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు..?

Venkatesh

ఈ సినిమాలో వెంకీ చేసిన వెంకీ గౌడ క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. అప్పటి వరకు సినిమా ఓ లెవల్లో ఉంటే.. వెంకీ ఎంట్రీ తర్వాత వేరే లెవల్ కి వెళ్లింది. అయితే.. ఈ క్రేజీ కాంబో కోసం వెంకీకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. అంతే కాకుండా.. రకరకాల నెంబర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దీంతో వెంకీ పారితోషం అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు దీని గురించి మన శంకర్ వరప్రసాద్ గారు నిర్మాతల్లో ఒకరైన సుస్మిత క్లారిటీ ఇచ్చారు.

Venkatesh

ఇంతకీ ఏం చెప్పారంటే.. వెంకటేష్ గారు మా ఫ్యామిలీ మెంబర్ లాంటి వారు. ఆయన అడిగింది మేము ఇచ్చాం.. కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ లో ఉండటం అమూల్యమైనది అని చాలా బ్యాలెన్స్‌డ్ గా చెప్పారు. ఈ రోల్ కోసం కాంటాక్ట్ చేసినప్పుడు వెంకటేష్‌ గారు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పారని సుస్మిత చెప్పారు. చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వెంటనే ఒప్పుకున్నారని అన్నారు. అయితే.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చాలా పెద్ద మనసు చూపించారని సుస్మిత తెలియచేశారు కానీ.. ఎంత ఇచ్చారు అనేది మాత్రం బయటపెట్టలేదు.

Venkatesh

CLICK HERE TO READ అసలు ప్లాన్ ఇదే..

CLICK HERE TO READ MORE

Leave a Reply