తిరుమలలో వెంకటాద్రి నిలయం రెడీ

తిరుమలలో వెంకటాద్రి నిలయం రెడీ

  • భారత ఉప రాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్
  • రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరు

( ఆంధ్రప్రభ, తిరుమల ప్రతినిధి ) : తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వెంకటాద్రి నిలయం, శ్రీవారి ప్రసాదాల ఇంగ్రెడియెంట్స్ – విజన్ బేస్డ్ సార్టింగ్ మెషిన్ ప్లాంట్ ను భారత దేశ ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ( Vice President Radha Krishan) , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Ap CM Chandra Babu Nayududu) గురువారం ఉదయం (25 .9.25న) ప్రారంభించారు.
అనంతరం వెంకటాద్రి నిలయం భవనంలో మాస్టర్ ప్లాన్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనంరామనారాయణరెడ్డి, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ , ఆర్జీటీ శాఖా మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు,తిరుపతి, కోవూరు శాసన సభ్యులు అరణి శ్రీనివాసులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, టీటీడీ ఈ ఓ అనిల్ కుమార్ సింఘాల్, అనంతపురం డి ఐ జి డాక్టర్ పిమోషి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు.

Leave a Reply