వేమూరి శంకర్ గౌడ్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తనపై నమ్మకంతో తనకు ఇచ్చిన పదవిని బాధ్యతగా భావిస్తూ, ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆలయ అభివృద్ధి కమిటీ నూతన అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్(Nemuri Shankar Goud) అన్నారు.
హైదరాబాద్, హిమాయత్ నగర్ లోని టీటీడీ(TTD) దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక అయిన శంకర్ గౌడ్ శనివారం27 సెప్టెంబర్ 2025 ఉదయం దేవాలయంలోని ప్రధాన మండపంలో వేదపండితుల అశీర్వచనంతో పదవి ప్రమాణం చేశారు.
అధ్యక్షుడిగాగా బాధ్యతల స్వీకరణ(assumes responsibility) అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఆ దేవదేవుని సేవ చేసుకునే భాగ్యం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఘనకీర్తి కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అనుబంధ దేవాలయంగా మన హైదరాబాద్(Hyderabad) హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) వారి దేవాలయం కొలువై ఉన్నదని, ఇంతటి ప్రసిద్ధి గల దేవాలయానికి అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తన అదృష్టం గా భావిస్తున్నానని అన్నారు నేమూరి శంకర్ గౌడ్.
తమపై నమ్మకంతో తనను ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారికి, శాసన మండలి సభ్యులు నాగబాబు గారికి ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు
