వేమూరి రాధాకృష్ణ మృతి..

ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామానికి చెందిన స్నేహశీలి వేమూరి రాధాకృష్ణ (71) మృతి చెందారు. ఈయన ఘంటసాల గ్రామంలో ఎర్ర రాధాకృష్ణ , కోళ్లఫారం రాధాకృష్ణ గాను ఈయన సుపరిచితులు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. విజయవాడలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన స్నేహితులు తెలిపారు. దివితాలుకాలో కోళ్ల పరిశ్రమ ప్రారంభం నుండి పలువురకు పౌల్డ్రి ప్రముఖులకు సుపరిచితులుగా ఉండేవారు.

ఘంటసాల మండల ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణం కమిటీ అధ్యక్షునిగా రైతులను సంఘటిత పరిచి రైతుల విరాళాలతో అక్కడ భవనం నిర్మించారు. జలధీశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లోను, పలు అభివృద్ధికార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. అందరితో స్నేహభావంతో మెలిగే వారని ఆయన మరణం బాధాకరమని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ సంతాపం తెలిపారు. ఘంటసాల గ్రామమంలో ఈరోజు మధ్యాహ్నం 2గంటల నుండి అంత్యక్రియలు నిర్వహిస్తారని స్నేహితులు తెలిపారు.

Leave a Reply