Vemulapalli | వెంకట్రామయ్యకు నివాళులు
Vemulapalli | మోపిదేవి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేములపల్లి (Vemulapalli) వెంకట్రామయ్యకు ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్ప గ్రామానికి చెందిన వెంకట్రామయ్య శనివారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఆదివారం ఉదయం వెంకట్రామయ్య ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూల మాలలతో నివాళులు అర్పించి, తెలుగుదేశం పార్టీ జెండా కప్పారు.
పీఏసీఎస్ చైర్మన్ (Chairmen) నాదెళ్ల శరత్ చంద్రబాబు, కంఠంనేని శివశంకర్(పెదబాబు), రావి నాగేశ్వరరావు, సబ్బినేని అబ్బాయి గారు, మండల బాల వర్ధనరావు, చందన రంగారావు, విక్కుర్తి రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, వేములపల్లి శ్రీహరి, పులిగడ్డ చంద్ర లతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ హోదాలలోని నేతలు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

