Vemsoor | మొక్కలు నాటడమే కాదు – సంరక్షణ కూడా..

Vemsoor | మొక్కలు నాటడమే కాదు – సంరక్షణ కూడా..

ఆదర్శం జయలక్ష్మీపురం సర్పంచ్ గడిపర్తి

Vemsoor | వేంసూరు, ఆంధ్రప్రభ : మొక్కలు నాటటమే కాదు, నాటిన మొక్కలను ఎలా సంరక్షించుకోవాలో జయలక్ష్మిపురం సర్పంచ్ గడిపర్తి శ్రీనివాసరావు ను చూస్తే అర్థం అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో హరిత హారం పేరుతో వేలాది మొక్కలను, గ్రామ గ్రామాన నాటినట్లు, వాటిని సంరక్షిస్తున్నట్లు కాగితాల్లోనే చూస్తాం. అక్కడక్కడ కనిపిస్తున్నాయో అవికూడా ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలో నాటి, సంరక్షించినవే అధికం. రెండు నెలల క్రితం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటి సంరక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Vemsoor

దీంతో పలు గ్రామాలలో రహదారుల వెంట మొక్కలు నాటారు. అయితే ఎప్పటి లాగే చాలా గ్రామాలలో నాటిన మొక్కలకు సరైన రక్షణలేక, నీరు పెట్టే నాధుడు కరువై మొక్కలు ఎండిపోతున్న తీరు కనిపిస్తూనే ఉంది. అయితే అందుకు భిన్నంగా మండల పరిధి లోని జయలక్ష్మిపురం గ్రామంలో సర్పంచ్ గడిపర్తి శ్రీనివాసరావు మొక్కల రక్షణకు సమగ్ర చర్యలు తీసుకోవటంతో పాటు, నీటి ఎద్దడి నివారిస్తున్నారు. ఈయన గ్రామ పంచాయితీ ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ప్రజాదరణ కలిగిన గడిపర్తి, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, గ్రామాభివృద్ధిపై తనదైన అభివృద్ధి మార్క్ వేస్తున్నారటంలో ఎటువంటి సందేహం లేదు. 12 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, సహకారంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి నాంది పలికారు. ఇది కదా కావలసింది ప్రజలకు.

Leave a Reply