హైవేపై వాహనాల తనిఖీలు..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పరిధిలోని మహారాష్ట్ర జాతీయ రహదారిపై, కోటపెల్లి మండలం పారుపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. పోలీసుల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్ తన సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ నెల 31 వరకు తనిఖీలు కొనసాగనున్నట్లు సీఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై, రాంగ్‌రూట్‌లో ప్రయాణించేవారిపై, ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
