వాహనాల తనిఖీలు

వాహనాల తనిఖీలు
ఆంధ్రప్రభ, గుడిహత్నూర్ : గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని, అలాంటి వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని, అలా ఇస్తే తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో పలువురు వాహనదారులకు జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
