పుట్టపర్తిలో వేద పురుష సప్తహ జ్ఞాన యజ్ఞం ఆరంభం

( పుట్టపర్తి ఆంధ్రప్రభ ) : ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజుల్లుతున్న పుట్టపర్తి (Puttaparthi) ప్రశాంతి నిలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వేదపురుష సప్తహ జ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం సాయికుల్వంత్ సభ మందిరంలోని భజన మందిరంలో వేదపండితులైన పైడిమర్రి సుబ్బా అవధాని బృందం (Pydimarri Subba Avadhani Team) ఆధ్వర్యంలో కలశపూజ, కుంకుమార్చన, సాంప్రదాయ బద్ధంగా యజ్ఞసంకల్పంతో కలశాన్ని యజ్ఞం నిర్వహించే పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి ఊరేగింపుగా తీసుకువచ్చారు.

వేదపండితులు రెండు చెక్కల ఘర్షణ ద్వారా సాంప్రదాయంగా ఉత్పత్తి అయిన పవిత్ర అగ్ని కీలలను మొదటగా భగవాన్ సత్యసాయిబాబా పాదపద్మముల వద్ద ఉంచి అనంతరం యజ్ఞంలో నిమజ్జనం చేసి యజ్ఞాన్ని ప్రారంభింపజేశారు. నవరాత్రి ఉత్సవాల (Navratri celebrations) తో పాటు వారం రోజులపాటు జరిగే యాగ కర్మ, వేద పురుష సప్తహ జ్ఞాన యజ్ఞాన్ని ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్రాడిటోరియంలో వేద పండితులు ప్రారంభించారు.

పురాణాల ప్రకారం దసరా అసురులపై, దేవతలు విజయాన్ని సూచిస్తుందని అనగా దుష్టశక్తులపై ధర్మం సాధించిన విజయం. ఈ కార్యక్రమానికి సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఏడు రోజులపాటు జరిగే మహా యజ్ఞ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply