వాణి విద్యానికేతన్ ఉత్తమ ఫలితాలు..

వాణి విద్యానికేతన్ ఉత్తమ ఫలితాలు..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని చల్లగరిగ వాణి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 5 తరగతి టీజీ సెట్ ఫలితాలలో 19 మంది విద్యార్థులు సీట్లు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ బండి సంపత్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల పట్టుదల ఉపాధ్యాయుల కృషితో సీట్లు సాధించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బండి ఇందిర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
