నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ నందు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా పోలీస్ ఆఫీసర్స్ వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ ఎస్బీఐ కనకయ్య డీసీఆర్బీ సీఐ ఉపేందర్ రావు, సీఐ అశోక్ రెడ్డి, ఆర్ఐ జగన్, ఎస్సై గోవర్ధన్, ఆర్ఎస్ఐలు గౌస్ పాషా, శివాజీ లతోపాటు 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

