Vajramma | అభివృద్ధి కోసం పాటుపడతా.. గెలిపించండి..

Vajramma | అభివృద్ధి కోసం పాటుపడతా.. గెలిపించండి..

సర్పంచ్ అభ్యర్థి బక్క వజ్రమ్మ

Vajramma | ధర్మసాగర్, ఆంధ్రప్రభ : ధర్మసాగర్ అభివృద్ధే ధ్యేయంగా పాటుపడతానని తనను సర్పంచిగా గెలిపించాలని ధర్మసాగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి బక్క(కొట్టె) వజ్రమ్మ విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ‌ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వజ్రమ్మ ఇంటింటి ప్రచారం చేపట్టారు. మనీ పర్స్ కు ఓటేసి గెలిపించండని జోరుగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని గడపగడపకు వెళ్లి ఎన్నికల్లో సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నుండి ధర్మసాగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెస్తానని పేర్కొన్నారు.. అవినీతిరహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పేదలకు సాఫీగా అందేలా పారదర్శకంగా పనిచేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

Leave a Reply