ఆపరేషన్ వజ్ర ప్రహార్.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

ఆపరేషన్ వజ్ర ప్రహార్.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

గంజాయి అక్రమ రవాణా…. ఇద్దరు అరెస్ట్
2 కిలోల గంజాయి స్వాధీనం..

నంద్యాల బ్యూరో,ఆంధ్రప్రభః మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు ఆపరేషన్ “వజ్ర ప్రహార్” అనే కార్యక్రమాని ఏపీ సర్కార్ చేపట్టింది. ఇందులో భాగంగా పట్టణంలో విస్తృత దాడులు చేయగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు, నంద్యాల ఎస్ డి పి ఓ ఎం.జావళి పర్యవేక్షణలో, 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ , వారి సిబ్బంది కలిసి, విశ్వసనీయ సమాచారం ఆధారంగా టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి, వారిని అరెస్టు చేసి, వారి నుండి సుమారు 2 కే‌జి ల గంజాయిని, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సి ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.


జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి ఉంచాలన్న జిల్లా ఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్ పర్యవేక్షణలో పట్టణంలోని జగజ్జనని నగర్, చెరువుకట్ట , మల్లెలమ్మ గుడి వెనుక ప్రాంతంలో దాడి నిర్వహించారు. పట్టణానికి చెందిన బయట నివాసి ప్రస్తుతం నందమూరి నగర్ లో ఉంటున్న దాసరి కళ్యాణ్ మరో వ్యక్తి బైటీ పేట నివాసి మాందాపురం మనోహర్ ల ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు 2 కిలోల గంజాయి , రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోని సీజ్ చేశారు.

వారి ఇద్దరిలో ఒకరైన దాసరి కళ్యాణ్ పై గతంలో సారాయి కేసు కూడా వున్నదన్నారు. గత కొద్ది రోజుల క్రితము నుండి వారు మద్యం త్రాగడము, గంజాయి ఇతర చెడు అలవాట్లకు లోనై, జల్సాలు చేస్తూ, గంజాయి సేవిస్తూ తిరుగుతూ ఉండేవారన్నారు. ఆ క్రమములో వారు అప్పుడప్పుడు గంజాయి కోసం వైజాగ్ దగ్గర గల అరకుకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కేజీ 4 వేల రూపాయలకు కొనుగోలు చేసి నంద్యాలకు తెచ్చుకొని వారు ఇద్దరు సమానముగా గంజాయి పంచుకొని, ఇక్కడ 10 గ్రాముల ప్రకారము చిన్న చిన్న ప్యాకెట్స్ గా తయారు చేసి, 100 గ్రాముల ప్యాకెట్ సుమారు 2 వెల రూపాయల చొప్పున అధిక లాభము వచ్చేలా నంద్యాల టౌన్ లో కాలేజీ విద్యార్థులకు, సాధువులకు అమ్మేవారిని విద్యార్థులలో తేలిందన్నారు. పట్టణంలో అక్కడక్కడ గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నారన్నారు. గంజాయి విక్రయాన్ని అడ్డుకుని నిందితులను పక్క సమాచారంతో పట్టుకున్న వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జి . సుధాకర్ రెడ్డిని, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

పోలీసులు హెచ్చరికలు
ప్రజలకు, విద్యార్థులకి పోలీసుల శాఖ తరుపున సందేశం


ప్రభుత్వం నిషేధించిన గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా, విక్రయం చట్టవిరుద్ధం అన్నారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఇంటర్, డిగ్రీ , ఇంజనీరింగ్ కాలేజ్ ల యాజమాన్యాలు వారి వారి విద్యార్థులకి తరచుగా మత్తు పదార్థాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని యాజమాన్యాలను కోరారు. మాదకద్రవ్య రహిత సమాజం కోసం పోలీసులతో కలిసి ముందుకు రండి అందరం కలిసి సమాజాన్ని కాపాడుకుందాం అంటూ తల్లిదండ్రులకు అధ్యాపకులకు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు కోరారు.

Leave a Reply