Vajpayee | విగ్రహ ప్రతిష్ఠకు ఘన ఏర్పాట్లు
- ధర్మవరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహం
Vajpayee | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ధర్మవరం పట్టణంలో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు(Managers) తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు ధర్మవరం కాలేజ్ గ్రౌండ్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరుకానున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ(Srinivas Verma), రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర బీజేపీ విభాగాల ప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ, ఆయన రాజకీయ జీవితం, విలువలు, ప్రజాస్వామ్యంపై చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా పలువురు నేతలు(Many leaders) గుర్తు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు నాయకత్వ విలువలు, దేశభక్తి భావాలు మరింత బలపడతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంగా ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చేతుల మీదగా విద్యార్థులకు సైకిళ్లు అందజేయబడతాయి. దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు(Officers) పేర్కొన్నారు.ఈ రెండు కార్యక్రమాలు ఒకే వేదికపై నిర్వహించడంతో ధర్మవరం పట్టణంలో పండుగ వాతావరణం నెలకొననుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

