గాలికుంటు నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

గాలికుంటు నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : గాలికుంటు నివారణ టీకాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దఎడ్గి గ్రామసర్పంచ్ ఆస్పత్వర్ అనిల్ కుమార్ అన్నారు.జుక్కల్ పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా, ఉపసర్పంచ్ ఫయ్యుమ్, పశువైద్యాధికారి పండరినాథ్ తో కలిసి పలు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు.
అవులకు, దూడలకు బర్రెలకు, గేదెలతో పాటు ఆయా రకాల పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించవలసిన అవసరం మన అందరిపై ఉందని, పశువైద్య శాఖద్వారా ఏప్రిల్ 9 వరకు గ్రామాలవారిగా కొనసాగే ఇట్టి టీకాల కార్యక్రమాన్ని పశువుల పెంపకందారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రమేష్ చారి, ఎమ్మార్పీఎస్ జుక్కల్ మండల అధ్యక్షుడు ఐల్వర్ మారుతి, గోపాల మిత్రలు అంజయ్య, రవి, పశువుల పెంపకందారులు పాల్గొన్నారు.
