Uttar Pradesh | పాపం అంపైర్…

Uttar Pradesh | పాపం అంపైర్…

Uttar Pradesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తేనెటీగలు దాడి చేయడంతో అంపైర్ తీవ్రంగా గాయపడి మృతిచెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా… అంపైర్‌పై తేనెటీగల గుంపు అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆయన మరణించారు. ఈ ఘటనలో మైదానంలో ఉన్న చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

అంపైర్ మాణిక్ గుప్తా (65) స్టేడియంలో అండర్-13 క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేస్తున్నప్పుడు ఈ తెనేటీగల దాడి జరిగింది. భయాందోళనల మధ్య, ఆటగాళ్ళు, ప్రేక్షకులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే గుప్తాకు తీవ్ర గాయాలయ్యాయి.

Uttar Pradesh |

మొదట అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం అధునాతన వైద్యశాలకు తరలించారు.. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. గుప్తా దాదాపు 30 సంవత్సరాలుగా కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ సంఘటనలో మరో అంపైర్ జగదీష్ శర్మ కూడా గాయపడ్డాడు. అయితే ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్లు చెబుతున్నారు.

Leave a Reply