Utkur | బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేద్దాం

Utkur | బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేద్దాం
- జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్యారా లీగల్ వాలంటర్ బాలరాజ్
Utkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేద్దామని నారాయణపేట జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్యారా లీగల్ వాలంటీర్ బాలరాజ్ అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు బాల్య వివాహల, ఎన్విరాన్ మెంట్ లీగల్ లిటరసీ పై వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… వివాహానికి చట్టబద్ధమైన వయసు అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేయాలని సూచించారు. ఈ వయసు రాకముందే పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధమని, సురక్షితం కాదని, ఇది అనేక సమస్యలైన మానసిక, శారీరక ఆరోగ్యం, తమ కలలను సాకారం చేసుకోలేకపోవడం, నిరక్షరాస్యత, నిరుద్యోగం పెరిగిపోవడం లాంటి సమస్యలకు దారి తీయవచ్చన్నారు. మీరు సమాచారం తెలియజేయాలనుకుంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర 15100 కు ఫోన్ చేయాలన్నారు. నారాయణపేట జిల్లాను బాల్య వివాహరహిత జిల్లాగా మార్చగలమన్నారు.
రైతులు వరి పొలాల్లో ఉన్న వరికొయ్యలు కొయ్యరాదని, దాని వలన పర్యావరణ కాలుష్యంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ కిషోర్ కుమార్, ఉపాధ్యాయ బృందం రమేష్, గోపాల్, గజలప్ప, శేఖర్, మనోహర్, హర్షద్, ఉమా, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
