ఆయా కాలనీలో హోలీ వేడుకలు..

ఆయా కాలనీలో హోలీ వేడుకలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల కేంద్రంలోని ఆయా కాలనీలలో బుధవారం హోలీ వేడుకలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం గ్రహణం నేపథ్యంలో హోలీ పండగ అంతంత మాత్రమే జరుపుకోగా బుధవారం మండలంలోని పులిమామిడి, త్రిప్రాస్ పల్లి, మల్లేపల్లి, ఎడవెల్లి, పగిడిమర్రి, బిజ్వార్ తదితర గ్రామాలతో పాటు ఊట్కూర్, పట్టణంలోనిపాతపేట, ఎల్బీనగర్, శ్రీరామ్ నగర్, ఈశ్వర మందిర్, కార్గిల్ చౌరస్తా, శివాజీనగర్ తదితర కాలనీలలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.

చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా ఒకరిపై ఒకరు వివిధ రకాల రంగులు చల్లుకొని హోలీ వేడుకలు అత్యంత ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా చిన్నారులు యువకులు , మహిళలు ఆయా కాలనీలో డీజేలు ఏర్పాటు చేసుకుని రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు హోలీ సంబరాల్లో మునిగిపోయారు.హోలీ వేడుకల్లో భాగంగా పలువురు యువకులు ఇంటింటికి వెళ్లి రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఇంటిల్లిపాది వివిధ రకాల రంగులు చల్లుకొని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆనందోత్సవాల మధ్య హోలీ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షించారు.
