Utkoor | సీట్ పేరుతో వేధించడం సరికాదు.

Utkoor | సీట్ పేరుతో వేధించడం సరికాదు.
ఊట్కూర్ లో ప్లే కార్డులతో నిరసన, రాస్తారోకో
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి విఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుకు సీట్ నోటీసులు ఇవ్వడం సరైందికాదని ఊట్కూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్ కుమార్, పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మండల యువజన అధ్యక్షులు చింతాన్ పల్లి ఆనంద్ రెడ్డి, బీఆర్ ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కోరం శివారెడ్డి అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ చెక్పోస్ట్ వద్ద బీఆర్ ఎస్ శ్రేణులు ప్లే కార్డులతో నిరసన చేపట్టి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సిట్ పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని తెలంగాణప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడి పై రాజకీయ వేధింపులకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు.
ఫోన్ టాపింగ్ అంటూ కాంగ్రెస్ రెండేళ్లుగా గులాబీ పార్టీపై అసత్యపు ప్రచారాలు చేయడం సరైనది కాదన్నారు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన మహనీయుడిని ఇబ్బంది పెట్టడం సరికాదని తెలంగాణ ప్రజలందరూ వీటిని గమనిస్తున్నారని రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కక్ష సాధింపు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు తిమ్మయ్య, ఇబాదూర్ రెహమాన్, షేక్ సమీ, వడ్ల గంగాధర్ చారి, రహీం, మునీర్, ఇర్ఫాన్, అంజి, బలరాం, అశోక్, శ్రీకాంత్, సురేష్, భాస్కర్ రెడ్డి, రామ్ రెడ్డి, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
