ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బాలాపూర్ లడ్డూ (Balapur Laddu) వేలం 1994 నుంచి జరుగుతోంది. స్థానికులతో పాటు స్థానికేతరులు ఈ వేలంలో పాల్గొంటారు. బాలాపూర్ లడ్డూ వేలం డబ్బును మొత్తం బాలాపూర్ గణేష్ ఉత్సవ్ కమిటీ (Ganesh Utsav Committee) గ్రామ అభివృద్ధికి, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది.
ఈ డబ్బుతో బాలాపూర్ గ్రామంలో రోడ్లు నిర్మించడం, చెరువులు తవ్వడం, లైట్లు ఏర్పాటు చేయడం, పాఠశాలలు(Schools), ప్రభుత్వ కార్యాలయాల (Government Offices) నిర్మాణం వంటి పనులకు ఖర్చు చేస్తారు. ఇలా చేసిన అభివృద్ధి (Development)తో బాలాపూర్ గ్రామ రూపురేఖలు మారిపోయాయి.

