నోబెల్ కోసం ఏదైనా చేసేలా ఉన్నారని నెట్టింటా ట్రోలింగ్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి నోబెల్ కల అలా ఇలా లేదు.. దానికోసం ఏదైనా చేసేలా ఉన్నారు ఆయన. ఇది మనం చెబుతున్నది కాదు నార్వే దేశంపై సుంక విధించిన ట్రంప్. ఆ దేశంతో చర్చలంటూ ఫోన్ చేసి నోబెల్ గురించి అడిగారట. ఇది సాక్షాత్తు నార్వే దేశపు పత్రికే ఓ స్టోరీ పబ్లిష్ చేసింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ కి మరి ఇంత నోబెల్ డ్రీమ్స్ ఏంటని నెట్టింటా ట్రోలింగ్ ప్రారంభమైంది. ట్రేడ్ టాక్స్ పేరుతో అవార్డ్ లాబీయింగ్ చేసన్నట్టు సమారచారం. ట్రంప్ నోబెల్ డ్రీమ్స్ పిచ్చి పీక్స్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరీ విచిత్రంగా మారిపోతోంది. ఇప్పటికే అనేకసార్లు తానేదో పెద్ద శాంతి దూతలా మాట్లాడుతూ.. అభాసు పాలైన ట్రంప్ మరోసారి అదే పాట పాడారు.
ఆరు నెలల్లో ఆరు యుద్ధాలను ఆపాను అని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా పాక్ ఇండియా అను యుద్ధానికి సిద్ధమైతే తన జోక్యంతోనే వారు ఆగిపోయిందంటూ గొప్పలు చెప్పుకొచ్చారు. ఇది ఒకసారైతే ఓకే అనుకోవచ్చు. కానీ ఇన్నిసార్లు ఇలా చెప్పడం ఖచ్చితంగా ఆయన పైథ్యానికి నిదర్శనమే అయి ఉండాలని నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.
ఇది ఇలా ఉండగానే మరో ప్రచారం కూడా కలకలం రేపుతోంది. నార్వే దేశంతో తాను విధించిన సుంకాలతో జూలై నెలలో చర్చలు జరిపారట. నార్వే ఆర్థిక మంత్రి జేమ్స్ స్టోలెన్బర్గ్ తో ఫోన్లో మాట్లాడుతూ.. తన మనసులో మాట బయట పెట్టేసినట్లు చెప్తున్నారు. సుంకాల సంగతి మాట్లాడుతూనే సంతట్లో సడేమియా లాగా తనకి నోబెల్ ప్రైజ్ కావాలని అడిగారట. డాజన్స్ నార్నింగ్స్ లైవ్ అనే ఓ నార్వే పత్రిక ఈ మెరకు ఓ కథనం ప్రచురించింది. ఈ స్టోరీ రాగానే ట్రంప్ కి నోబెల్ అంటే ఇంత పిచ్చఏంటి అంటూ జోకులు వేసుకుంటున్నారు. నిజానికి ట్రంప్ ఏ యుద్ధాన్ని ఎలా ఆపారో ఆయన చెప్పడమే కానీ ఇతర దేశాలు నిర్ధారించింది.. ఒక ఇరాన్, ఇజ్రాయిల్ వారు విషయంలోనే, అసలు ఆ యుద్ధం కూడా ట్రంప్ ఇజ్రాయిల్ ను ఎగదోసి చేసింది. ఇలాంటి స్థితిలో ట్రంప్ తనకి తాను శాంతి దూతను అని చెప్పుకోవడంపై జోకులు పేలుతున్నాయి. కానీ ఆయన మాత్రం దాన్ని అస్సలు కేర్ చేయడం లేదు. పట్టించుకుంటే ఆయన ట్రంప్ ఎందుకు అవుతారు..? అని విమర్శలు వస్తున్నాయి.