US government | మరోసారి షట్‌డౌన్..

US government | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదంపై నెలకొన్న ప్రతిష్టంభన చివరికి పాక్షిక ప్రభుత్వ మూసివేతకు దారితీసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన ఫెడరల్ బడ్జెట్‌కు కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం లభించకపోవడంతో ఇవాళ్టి నుంచి పాక్షిక షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఫెడరల్ నిధుల గడువు నిన్న అర్ధరాత్రితో ముగియడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
అయితే, ఈ షట్‌డౌన్ స్వల్పకాలమేనని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని చట్టసభ సభ్యులు అంచనా వేస్తున్నారు. మిన్నియాపాలిస్లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఇద్దరు నిరసనకారులు మరణించడంపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బడ్జెట్ చర్చలు నిలిచిపోయాయి. ఈ ఘటన కారణంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి (డీహెచ్ఎస్) నిధుల కేటాయింపుపై ప్రతిష్ఠంభన ఏర్పడి, షట్డౌన్కు దారితీసింది. ఒప్పందం కుదరకపోవడంతో విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, రక్షణ వంటి పలు కీలక శాఖల్లో అత్యవసరం కాని కార్యకలాపాలు నిలిచిపోయాయి.
