AP | ఎయిమ్స్ ను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

ఉమ్మడిగుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం సందర్శించారు. ఇన్ పేషెంట్ ఔట్ పేషెంట్ వార్డులను పరిశీలించి పేషెంట్లతో ఆయన స్వయంగా సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులతో కలిసి సౌకర్యాలు సమస్యలు తదితర వివరాలపై ఆరా తీశారు. అభివృద్ధి చేయాల్సిన పనులు, సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. విభజిత ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్యశాలను 150 ఎకరాల్లో మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించారు. ఎయిమ్స్ కు కావలసిన విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా గడిచిన ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం అందించలేకపోయింది. 10 ఎకరాల అదనపు స్థలంతో పాటు పవర్, వాటర్ సప్లై టిడిపి అందించడం జరిగింది.

రోగుల సంతృప్తి..
95% కు పైగా పేషెంట్లు ఇక్కడి సేవలు, సౌకర్యాలతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ తో కో-ఆర్డినేషన్ సాధ్యపరిచేందుకు ఇక్కడ వివరాలు తెలుసుకుంటున్నాము. 960 బెడ్స్ కావలసి ఉండగా కేవలం 600 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐసియులో 96 కావలసి ఉండగా 20 మాత్రమే పడకలు అందుబాటులో ఉన్నాయి. 2 లక్షల 73 వేలకు పైగా పేషెంట్లు ఇక్కడ సేవలు పొందుతున్నారు. మరింత ఎక్కువ మంది పేషెంట్లకు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఫార్మసీ మెడికల్ స్టోర్స్ షార్టేజ్, తక్కువ బస్సులు, బస్సు షెల్టర్లు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక రెండు బస్సులను అందించబోతున్నారు. ఎలక్షన్ కోడ్ ముగియగానే ఆ రెండు బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సులు అందజేసిన నారా లోకేష్కి ధన్యవాదాలు. ఇన్ పేషెంట్లు కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది.

ధర్మశాల అభివృద్ధి
అలాంటి వారికి ధర్మశాలను మరింత అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టబోతున్నాం. అంబులెన్స్ సర్వీస్ బయట నుంచి వచ్చిన వారికి అధికంగా ఛార్జ్ చేయడంపై చర్యలు తీసుకోబోతున్నాం. చార్జీలు కంటే ఎక్కువ వసూలు చేయకూడదని సూచీ బోర్డులు ఏర్పాటు చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ అనుకున్న విధంగా కంటే ఎక్కువ అభివృద్ధి చేసేందుకు నారా లోకేష్ గతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం. 23 ఆపరేషన్ థియేటర్లో ఉండాల్సి ఉండగా 12 మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతున్నాయి. అలాగే స్టాఫ్, సర్జన్లు మరింత మందిని త్వరలో నియమించుకునేలా ప్రయత్నిస్తాం. ఒక వెండర్ చేతిలోనే క్యాంటీన్ ఉండడం కూడా సమస్య అవుతుందని తెలియడంతో, మరిన్ని అదనపు టెండర్లను ఆహ్వానించాలని సూచించాం. గడిచిన వైసిపి ప్రభుత్వం కనీసం వాటర్, విద్యుత్తు కూడా ఇవ్వలేని పాలన చేసింది. టిడిపి వచ్చాక మాత్రమే ఆయా సౌకర్యాలు అందుబాటులోకి తేవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *