తిరుప‌తిలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) తిరుమల (Tirumala) వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్ర‌వారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అడిషినల్ ఈఓ (TTD Additional EO) వెంకయ్య చౌదరి నిర్మలమ్మకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శన (VIP Break Darshan) సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. వెంకయ్య చౌదరి ఆమెకు తీర్థ ప్రసాదాలను అందించారు.

Leave a Reply