union | కార్మికునికి సాయం…

union | కార్మికునికి సాయం…

union | గుడివాడ, ఆంధ్రప్రభ : బొమ్ములూరు పంచాయతీ గంగాధరపురం గ్రామం నివాసి అయిన బొబ్బరపల్లి రామకృష్ణ.. గుడివాడ ఆటోనగర్ రెండో రోడ్ లో మెకానిక్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే.. పని చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఇంజన్ బ్లాకు(Engine block) చేతి పై పడింది.

రెండు చేతి వేళ్ళు కట్ అయ్యాయి. ది గుడివాడ ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్(industrial and automobile) వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రమాదానికి గురైన ఆ కార్మికున్ని పరామర్శించారు. మంగళవారం కార్మికునికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసారు.

ఈ కార్యక్రమంలో యూనియన్(union) గౌరవ అధ్యక్షులు తమ్మిశెట్టి లక్ష్మణరావు, అధ్యక్షులు అబ్దుల్ హమీద్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కుద్దుస్, ఉపాధ్యక్షులు బొబ్బరపల్లి ఆంజనేయులు, నాయకులు షేక్ మొహిద్దిన్, భాష షేక్, రహ్మాన్ రెడ్డి, నాగరాజు, కల్వకుంట నాగరాజు పాల్గొన్నారు.

Leave a Reply