Union Bugdet… వేతన జీవులకు వరం.. చిన్న పరిశ్రమలకు ఊతం.. రైతన్నలకు అండ
న్యూ ఢిల్లీ – ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..’ అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో నేటి ఉదయం 2025 -26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని మంత్రి పేర్కొన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ, త్వరిత, సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తిదాయకం, మార్గదర్శకమని వెల్లడించారు.
దేశంలో వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టిసారించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 7.7 కోట్ల రైతులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ను దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక ఉద్యోగులకు నిర్మల వరం ప్రకటించారు. ఆదాయపన్ను మినహాయింపును ఏకంగా రూ.12 లక్షలకు పెంచారు.. అలాగే పన్న శ్లాబ్ లను తగ్గించారు.
కాగా ఎన్డిఎ ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం….
బడ్జెట్ లోని ముఖ్యంశాలు ..
రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
బిహార్‌లో మకానా బోర్డు ఏర్పాటు
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు
రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
పోస్టల్ రంగానికి కొత్త జవసత్వాలు
మధ్య, చిన్న పరిశ్రమలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత
ప్రధానమంత్రి ధన్‌ధాన్య యోజన ప్రకటించిన నిర్మల
ధన్‌ధాన్య యోజనతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం
గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పన
పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం
పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం
ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన నిర్మలా సీతారామన్.. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం.. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి.
బీహార్‌కు 3 పథకాల వరాలు.. సోలార్ సెల్స్, ఈవీ బ్యాటరీలు, విండ్ టర్బయిన్స్‌కు ఊతం.. పెట్టుబడులు మా థర్డ్ ఇంజిన్ :
ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహాకాల కోసం క్లీన్‌టెక్ మిషన్.
మరో 120 రూట్లలో ఉడాన్ పథకం.
పర్వత ప్రాంతాల్లో హెలిప్యాడ్స్ ఏర్పాటుకు చర్యలు
పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు.
రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి.
120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.
50 ప్రధాన టూరిస్ట్ డెస్టినేషన్లలో రాష్ట్రాల భాగస్వామ్యంతో సౌకర్యాలు.
ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం ఎఫ్ ఇ ఐ లకు అనుమతి. ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అనుమతి
ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు.
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు.
అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్ క్యాన్సర్ సెంటర్లు.
కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా.
బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ.
బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్.. రూ. లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్.
అసోంలో 12.7 లక్షల టన్నుల యూరియా ప్లాంట్.
రూ.30 వేలతో స్ట్రీట్ వెంటర్స్‌కు క్రెడిట్ కార్డులు.. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం :నిర్మలా సీతారామన్.
మధ్య ,చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు.
స్టార్టప్‌లకు ఇచ్చే రుణాలు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు.
ఇక గ్రామీణ ఎకానమీలో లక్షన్నర గ్రామీణ పోస్టాఫీసుల పాత్ర
ఆరు రంగాల్లో మార్పులు తెచ్చే సంస్కరణలు.
టాక్సేషన్, విద్యుత్, అర్బన్ డెవలప్‌మెంట్, మైనింగ్, ఫైనాన్స్, రెగ్యులేటరీ సంస్కరణలు: .
50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు.
సంస్కరణలు అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు.
50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు
మూలధన వ్యయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు.
2028 వరకు జల్‌జీవన్ మిషన్ పొడిగింపు.
కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చే వారం రాబోతోంది
నగరాలకు గ్రోత్ హబ్స్‌గా మార్చేందుకు నిధులు.
రూ.25 వేల కోట్లతో మేరీటైమ్ అభివృద్ధి ఫండ్.
విద్యుత్ రంగంలో సంస్కరణలకు పెద్దపీట.
విద్యుత్ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు.
సంస్కరణలు అమలు చేస్తే జిఎస్డిపి లో 0.5 శాతం అదనపు రుణాలు
క్లీన్ ఎనర్జీ దిశగా అణుశక్తి మిషన్.. 2047 నాటికి 100 గేగా వాట్స్ ల అణు విద్యుత్ ఉత్పాదనే లక్ష్యం.
క్లీన్ టెక్ మ్యాన్‌ఫ్యాక్షరింగ్‌కు ఊతం.
ఇన్‌ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక.
పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక.. ప్రయోగాత్మకంగా 10 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య యోజన
కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంపు. కెసిసిల ద్వారా ఇచ్చే లోన్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.