Union Budget | రాష్ట్రపతితో నిర్మల భేటి… కేంద్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
న్యూ ఢిల్లీ – 2024 -25 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ రాష్రపతి ద్రౌపది ముర్ముతో భేటి అయ్యారు.. ఈ సందర్భంగా నిర్మల బడ్జెట ప్రతులను అందజేశారు. బడ్జెల్ విశేషానలు రాష్రపతికి వివరించారు.. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము ఆర్థిక మంత్రికి స్వీట్ తినిపించి ఆల్ ది బెస్ట్ చెప్పారు..
ఆ తర్వాత నిర్మల నేరుగా ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కెబినేట్ సమావేశంలో పాల్గొన్నారు.. కేబినెట్ సహచరులకు బడ్జెట్ కాపీలను ఆమె స్వయంగా అభినందించారు.. అనంతరం బడ్జెట్ ను కేబినేట్ ఆమోదించింది.. దీని తర్వాత ఆమె పార్లమెంట్ భవన్ కు వెళ్లారు.. సరిగ్గా 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.