అల్కరాజ్ వేట మొదలు

ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్ డెస్క్: స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ (U.S. Open 2025) టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో టైటిల్ వేట మొదలుపెట్టాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన అతను యూఎస్ ఓపెన్ తో సీజన్ ను ఘనంగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ దిశగా ఈ వరల్డ్ నం.2 ప్లేయర్ టోర్నీలో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో అతను 6-4, 7-5, 6-4 తేడాతో అమెరికా ఆటగాడు రెల్లీ ఓపెల్కాను చిత్తు చేశాడు.

రెండు గంటల 5 నిమిషాలపాటు సాగిన మ్యాచ్ లో అల్కరాజ్ వరుసగా మూడు సెట్లలో నెగ్గాడు. అయితే, ఓపెల్కాను నిలువరించడానికి అతను కాస్త శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థి ఏస్లు, విన్నర్లతో ఇబ్బందిపెట్టాడు. అయినప్పటికీ అల్కరాజ్ ఎక్కడా ఒత్తిడికి లోనవ్వలేదు. అల్కరాజ్ మూడు సార్లు ప్రత్యర్థి సర్వీసు బ్రేక్ చేశాడు. దీటుగా బదులిస్తూ ఓపెల్కానే తప్పులు చేసేలా ఒత్తిడి పెంచాడు. దీంతో ఓపెల్గా 9 డబుల్ ఫాల్ట్స్, 32 అవనసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

Leave a Reply