రైతులకు మొందా తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి

రైతులకు మొందా తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి
పెడన – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెడన నియోజకవర్గ రైతుల సమస్యలపై పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ప్రసంగించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పెడన నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుందన్నారు.
వరి తప్ప వేరే పంట పండే అవకాశం లేదని, గత సంవత్సరం మోంథా తుఫాన్ వల్ల రైతులందరూ బాగా నష్టపోయారన్నారు. మా నియోజకవర్గం సుమారుగా 3,690 హెక్టార్లు నష్టం జరిగిందన్నారు. దీని వల్ల రైతులందరూ బాగా నష్టపోయారని, రైతులకు నష్టపరిహారం అందించవలసిందిగా కోరారు.
