TG | హైద‌రాబాద్ లో ఇద్ద‌రు మైన‌ర్ బాలిక‌లు మిస్సింగ్…

హైదరాబాద్‌: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మచ్చ బోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమ‌య్యారు. తమ కుమార్తెలు రెండు రోజుల నుంచి కనబడడం లేదని బాలికల తల్లిదండ్రులు ఇవాళ‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలికల పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్ స్టా గ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు బాలికలిద్దరితో కలసి ఓయో రూమ్‌లో గడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరు ఈసీఐఎల్, మరొకరు దమ్మాయి గూడకు చెందిన వారిగా సమాచారం. ఆ ఇద్ద‌రు బాలిక‌లు వారితో క‌లిసి వెళ్లిన‌ట్లు భావిస్తున్నారు.. ఓయో రికార్డ్స్ ఆధారంగా ఆ ఇద్ద‌రు యువ‌కుల‌పై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply