నంద్యాల బ్యూరో, ఆగస్టు 11 (ఆంధ్రప్రభ) : రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా (Nandyal District) వాసులు ఇద్దరు మృతి చెందిన సంఘటన ఇవాళ‌ చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… కడప (Kadapa) నగర సమీపంలో కారు, లారీ ఢీకొన్న సంఘటనలో ఆళ్లగడ్డ మండలం (Allagadda Mandal) ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన దూదేకుల వినయ్ కుమార్ (36), ఆళ్లగడ్డకు చెందిన హుస్సేనమ్మ (43)లు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.

కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జుయిపోయింది. గాయపడిన వారు పరిస్థితి తీవ్రంగా ఉండటంతో చికిత్స నిమిత్తం నంద్యాల (Nandyala) ప్రభుత్వాసుపత్రికి త‌ర‌లించ‌గా, పరిస్థితి మెరుగుపడ‌క‌పోవటంతో తిరిగి కర్నూలు (Kurnool) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు తీసుకుని దైవ దర్శనం కోసం అరుణాచలం వెళ్లి తిరిగి వస్తుండగా లారీ, కారు ఢీకొన్నాయి. ఇరువురు మృతిచెందిన సంఘటనతో ఆళ్లగడ్డ మండలంలోనూ ఎస్.లింగం దిన్నె గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు (police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply