పరిషత్‌కు రెండు… పంచాయతీలకు మూడు విడతల్లో పోలింగ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ(MPTC, ZPTC) ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహించగా, పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ మూడు విడతలుగా నిర్వహిస్తారు. ఒక జిల్లాలో రెవెన్యూ డివిజన్(Revenue Division) వారీగా పోలింగ్ జరుగుతుంది.
మొదటి విడతలో 53 డివిజన్‌ల పరిధిలో 292 మండలాల జడ్పీటీసీ(ZPTC) స్థానాలకు, 2963 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 50 రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో 273 మండలాల జడ్పీటీసీ స్థానాలకు, 2786 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు.

పంచాయతీ(Panchayat) ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతాయి. మొదటి దశలో 17 రెవెన్యూ డివిజన్ పరిధిలో 77 మండలాల్లో 1988 సర్పంచ్ పదవులకు, అలాగే 17104 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరుగుతుంది. రెండో దశలో 49 రెవెన్యూ డివిజన్ పరిధిలో 246 మండలాల్లో 5414 సర్పంచ్ పదవులకు, అలాగే 47890 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్(Polling) జరుగుతుంది. మూడో దశలో 51 రెవెన్యూ డివిజన్ పరిధిలో 242 మండలాల్లో 5331 సర్పంచ్ పదవుల(Sarpanch Posts)కు 47294 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ నిర్వహిస్తారు.


