ఏసీబీ దాడిలో ఇద్దరు పట్టుబాటు..

మంథని, ఆంధ్రప్రభ: మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు ప్లాట్ రిజిస్ట్రేషన్ పనికి రూ.16,500 లంచం తీసుకుంటూ మంథని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్, డాక్యుమెంట్ రైటర్ రషీద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్ ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply