Turkey | టర్కీలో వేల్పూర్ వాసి మృతి..

Turkey | టర్కీలో వేల్పూర్ వాసి మృతి..
Turkey | వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్ గ్రామానికి చెందిన జెల్లా ప్రవీణ్ గుండెపోటుతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. బతుకుతెరువు కోసం టర్కీ(Turkey) దేశానికి వెళ్లాడు. కొద్దిరోజులకే అతడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా అక్కడి నుంచి మృతదేహం రావాల్సి ఉంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
