TTD | తిరుమలలో జూలై 29న గరుడ పంచమి

తిరుమల క్షేత్రంలో జూలై 29 (మంగళవారం) పవిత్రమైన గరుడ పంచమి పర్వదినం జరగనుంది. ఈ విశేషమైన రోజున, శ్రీ మలయప్పస్వామివారు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటల వరకు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెలలో స్వామివారు గరుడ వాహనంపై దర్శనమివ్వడం ఇది రెండోసారి.

ప్రతి ఏటా తిరుమలలో గరుడ పంచమిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నూతన వధూవరులు తమ వైవాహిక జీవితం ఆనందమయంగా సాగాలని, అలాగే స్త్రీలు తమకు పుట్టబోయే సంతానం గరుడుని వలె బలాఢ్యులుగా, ఉత్తమ వ్యక్తిత్వం కలవారిగా ఉండాలని కోరుకుంటూ “గరుడ పంచమి” పూజను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి విడుదల చేశారు.

Leave a Reply