దాడులకైనా ఓకే… చర్చలకూ ఓకే…

దాడులకైనా ఓకే… చర్చలకూ ఓకే…
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కొనసాగుతున్న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ మరో 4 నుంచి 5 వారాల పాటు కొనసాగవచ్చని ప్రకటించారు.ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమినేని ప్రోద్బలంతో తనపై హత్యాయత్నాలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. యూనైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ప్రకారం ఈ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. ఇరాన్‌లో సుమారు 200 మంది మృతి చెందినట్లు సమాచారం.
“అవసరమైతే దాడులు కొనసాగుతాయి… అదే సమయంలో చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నాం” అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అమెరికా ఈ ఆపరేషన్‌ను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
