YCP| పూర్ణచంద్రరావుకు నివాళులు..

YCP| పూర్ణచంద్రరావుకు నివాళులు..

ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షులు తమ్మనబోయిన శ్రీరాములు తండ్రి తమ్మనబోయిన పూర్ణచంద్రరావు అనారోగ్యం కారణంగా మరణించారు. శ్రీకాకుళం గ్రామ పంచాయతీ శివారు సూరపనేనివారి పాలెంలోని వారి నివాసం వద్ద పూర్ణచంద్రరావు పార్థివదేహాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సందర్శించి ఘన నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఘంటసాల జడ్పీటీసీ తుమ్మల మురళీకృష్ణ, ఘంటసాల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమూరి వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షులు వేమూరి ప్రవీణ్, శ్రీకాకుళం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదాసు సీతారాంబాబు, గ్రామ వైఎస్ఆర్సీపీ సెక్రటరీ కొక్కిగడ్డ సుధాకర్, గ్రామ వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు తోడేటి సుధాకర్, వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ నాయకులు తిరుమలశెట్టి సీతారాంబాబు, చిట్టూరి రమేష్(RK), రావూరి వాసు, సనకా శ్రీను, తిరుమలశెట్టి సూరిబాబు(బోసు), పెనుమత్స శేఖర్, పెనుమత్స వైయస్ పవన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply