మహాత్మా జ్యోతిరావు ఫూలేకు ఘన నివాళులు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : సమాజంలోని అసమానతలను నిర్మూలించేందుకు జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే చిరస్మరణీయుడని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు.

ఫూలే 199వ జయంతి సందర్భంగా వరంగల్ కొత్తవాడలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ అగ్రవర్ణాల అధిపత్యాన్ని ధైర్యంగా ఎదిరించి అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన ఫూలేను జాతి ఎన్నటికీ మరువదన్నారు.

విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మి శూద్రులు, అతి శూద్రులకు విద్యను అందించేందుకు పాఠశాలలు స్థాపించి ప్రజల్లో చైతన్యం నింపారని కొనియాడారు. తన భార్య సావిత్రిబాయి ఫూలేకు విద్య బోధించి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిపిన మహనీయుడని పేర్కొన్నారు.

స్త్రీ పురుష సమానత్వం కోసం ఎన్నో ఆటంకాలు, అవమానాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా కృషి చేసిన ఫూలే సేవలు అపూర్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుజ్జునూరి సుమన్, లింగబత్తిని శంకర్, సయ్యద్ హఫీజ్, మహమ్మద్ అఫ్రీద్, సానాది ప్రశాంత్, ప్రియాంక, రమాదేవి, పుణ్యవతి, లక్ష్మీ, మధుమిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply