గాంధీకి ఘ‌న నివాళులు

గాంధీకి ఘ‌న నివాళులు

నాగర్ కర్నూల్, ఆంధ్ర‌ప్ర‌భ : నాగర్‌కర్నూల్ గాంధీ పార్క్ వద్ద మ‌హాత్మా గాంధీ (Mahatma Gandhi) జ‌యంత్యుత్స‌వం ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (Kuchukulla Rajesh Reddy) మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… మ‌హాత్ముడి మార్గంలో ప్ర‌తి ఒక్క‌రూ న‌డ‌వాల‌ని అన్నారు.

నాగర్ కర్నూల్ అభివృద్ధి కి కృషి చేస్తానని చెప్పారు. నూతన బస్టాండ్, ఎటీసి సెంటర్, జూనియర్ కళాశాల నూతన భవనం, రూ.60 కోట్లతో బీసీ రోడ్డులు, ఇతర అభివృద్ధి పనులు చేప‌ట్టాన‌ని వివ‌రించారు.

Leave a Reply