కుటుంబానికి అండగా ఎమ్మెల్యే..
చిట్యాల,(ఆంధ్రప్రభ): చిట్యాల మండలం (Chityala Mandal) వెలిమినేడు గ్రామానికి చెందిన కొండ బుగ్గయ్య శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు అంతటి నరసింహ పారిజాత బుగ్గయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు వారి కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

